Minister Nadendla:రేష‌న్ మాఫియాపై ఉక్కుపాదం.. అక్ర‌మార్కుల అరెస్టులు త‌ప్ప‌వు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీ పై రేషన్ బియ్యం అందిస్తుంటే.. కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

Update: 2024-11-13 10:00 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీ పై రేషన్ బియ్యం అందిస్తుంటే.. కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. శాస‌న‌మండ‌లిలో ఈ రోజు(బుధ‌వారం) ఆయ‌న మాట్లాడుతూ.. రేష‌న్ మాఫియాపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1010 కేసులు నమోదు చేయ‌డంతో పాటు 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. విచార‌ణ అనంత‌రం అక్ర‌మార్కుల అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాలో MDU ఆపరేటర్ ప్రమేయం ఉంద‌న్నారు. కాకినాడలో 13 రైస్ మిల్లులపై గతంలో తనిఖీలు నిర్వ‌హించి క్రిమినల్ కేసులు నమోదు చేసిన‌ట్లు మంత్రి నాదేండ్ల పేర్కొన్నారు. పేదల‌కు అందాల్సిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు చెక్‌పోస్ట్‌ల‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింద‌న్నారు. సంస్కరణలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు కలిసి ఎన్ఓసీ సర్టిఫికెట్ ఉంటేనే పోర్ట్ అధికారులు బియ్యం ఎగుమతికి అనుమతించడం జరుగుతుంద‌న్నారు.

కూటమి ప్రభుత్వం 43 రూపాయల 40 పైసల‌కు కొనుగోలు చేసి పేద ప్రజలకు అందిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమ రవాణా చేయకుండా ప్రజలు కూడా అడ్డుకోవాలని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులపై తనిఖీలు జరుగుతున్నాయ‌ని, ఇప్పటికే కృష్ణా, గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలో స్వయంగా తానే తనిఖీలు నిర్వహించిన‌ట్లు గుర్తు చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో అక్రమ రవాణాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాకినాడలో ఈసీ చట్టం 1955 సెక్షన్ 6Aఎ కింద మొత్తం 13 కేసులు నమోదు చేసిన‌ట్లు చెప్పారు. అలాగే 51427110 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు. కొందరు హైకోర్టును ఆశ్రయించడం ద్వారా హైకోర్టు సూచన మేరకు నాన్ పిడిఎస్ రైస్ 26488 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 83 కోట్ల 77 లక్షల బ్యాంకు గ్యారంటీతో విడుదల చేయడం జరిగింద‌న్నారు. పిడిఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండియు ఆపరేటర్ల ప్రమేయం ఉంద‌న‌ని స్ప‌ష్టం చేశారు. అందులో భాగంగా కాకినాడ జాయింట్ కలెక్టర్ ఎనిమిది మంది ఎండియు ఆపరేటర్లకు జరిమానా విధించ‌డంతో పాటు ఒక ఎండీయు ఆపరేటర్‌ను తొలగించడం జరిగింద‌ని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ శాస‌న‌మండ‌లిలో వివ‌రించారు.

Tags:    

Similar News