Breaking: ఏపీలో మే 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల అసోషియేషన్ షాక్ ఇచ్చింది..
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల అసోషియేషన్ షాక్ ఇచ్చింది. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని తీర్మానించాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రులకు దాదాపు రూ.2 వేల కోట్లు ప్రభుత్వం బకాయిలు పడింది. ప్రైవేట్ ఆస్పత్రులకు బిల్లులు రాకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల అసోషియేషన్ సమావేశమై ఈ తీర్మానం చేశారు. మే 1 నుంచి అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ తీర్మానాల ప్రతులను రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు ఆరోగ్యశ్రీ సీఈవోకు పంపించారు. మరి ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చింస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి: Tirumala: టీటీడీకి కేంద్రం ఊరట.. ఆ విషయంలో మినహాయింపు