బిడ్డకు జన్మనివ్వడమే శాపంగా మారిందా?.. సొంత ఎంపీకి షాకిచ్చిన అధికార పార్టీ
ఉత్తరాంధ్ర ప్రాంతంలో మచ్చలేని నేతగా, నిఖార్సైన కమ్యూనిస్టుగా పేరుండి రెండు పర్యాయాలు చింతపల్లి అసెంబ్లీ నుంచి శానససభ్యుడిగా ఎన్నికైన జి.దేముడు కుమార్తె మాధవి. లోక్‌సభ సభ్యురాలిగా ఆమె పట్ల నియోజక వర్గంలో పెద్దగా వ్యతిరేకత లేదు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతంలో మచ్చలేని నేతగా, నిఖార్సైన కమ్యూనిస్టుగా పేరుండి రెండు పర్యాయాలు చింతపల్లి అసెంబ్లీ నుంచి శానససభ్యుడిగా ఎన్నికైన జి.దేముడు కుమార్తె మాధవి. లోక్‌సభ సభ్యురాలిగా ఆమె పట్ల నియోజక వర్గంలో పెద్దగా వ్యతిరేకత లేదు. ఆరోపణలు లేవు. తిరిగి ఆమెకే టికెట్ అని భావిస్తున్న తరుణంలో ఆమెను అరకు శాననసభా స్థానానికి ఇన్చార్జిగా నియమించారు.
అయితే, మాధవి అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తమైందనే కారణంతో బాలింతగా ఆమె నియోజక వర్గంలో పర్యటించడం కష్టమనే సాకుతో వైసీపీ ఐదో జాబితాలో ఆమెకు సీటు లేకుండా చేశారని తెలిసింది. ఎన్నికల సమయంలో పండంటి బిడ్డకు జన్మనివ్వడమే పోటీకి, పదవికి అనర్హురాలిని చేసింది. పాఠశాల నుంచి నేరుగా పార్లమెంటు మెట్టు ఎక్కిన ఆ అమాయక గిరిజనురాలి పరిస్థితి ఇప్పడు అగమ్యగోచరంగా మారిపోయింది. ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన హుకుంపేట జెడ్పీటీసీ మత్స్యలింగంనే ఇప్పుడు అరకు ఇన్చార్జిగా నియమించడం గమనార్హం.