దసరాకు ఊరు వెళ్తున్నారా..?.. మీకు APSRTC గుడ్ న్యూస్

దసరాకు సొంత ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది...

Update: 2024-09-30 13:38 GMT

దిశ, వెబ్ డెస్క్: దసరా(Dussehra)కు సొంత ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC) గుడ్ న్యూస్ తెలిపింది. పట్టణాలు, గ్రామాలకు ప్రత్యేక బస్సులు(Special Buses) నడపాలని నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 4 నుంచి 20వ తేదీ వరకూ బస్సుల రాకపోకలు సాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు 6100 బస్సులు నడిపేందుకు రెడీ అవుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల(Passengers)కు ఈ సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రయాణికులకు సులభంగా గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సేవలు ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

కాగా దసరా సెలవులను అక్టోబర్ 4 నుంచి 13వ తేదీ వరకూ కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా ప్రభుత్వాలు దసరా సెలవులను ప్రకటించాయి. దీంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను ప్రకటించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Similar News