Graduates MLC Elections: కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల నమోదుకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌(AP)లో త్వరలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduates MLC) ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-30 16:07 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌(AP)లో త్వరలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు(Graduates MLC Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఉమ్మడి కృష్ణా(Krishna) - గుంటూరు(Guntur) జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ(EC) కసరత్తు చేస్తోంది.ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల నమోదుకు ఎలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రెండు జిల్లాల పరిధిలోని పట్టభద్రులు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 తమ ఓటును నమోదు చేసుకోవాలని ఈసీ సూచించింది.కాగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం పట్టభద్రులు ఫారమ్‌ 18 నింపాల్సి ఉంటుంది.ఓటు హక్కు నమోదు చేసుకునే అభ్యర్థులు ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌(PC), ఆధార్‌(Aadhaar), ఓటర్‌ ఐడీ(Voter ID), పాస్‌పోర్టు ఫొటో(Passport Photo)ను అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌ ఎక్కడ పూర్తి చేసినా ఆధార్‌లోని అడ్రస్‌ ఆధారంగా తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. అధికారులు వెరిఫికేషన్‌ కోసం వచ్చినప్పుడు దరఖాస్తుదారుడు ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లు చూపించాలి.ఈ ఎన్నికకు సంబంధించి నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా, డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు . డిసెంబర్ 30న MLC ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.ఇక ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. 


Similar News