Breaking:ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి సస్పెండ్..
గనుల శాఖ మాజీ ఎండీ వెంకట్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ,వెబ్‌డెస్క్: గనుల శాఖ మాజీ ఎండీ వెంకట్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన వెంకటరెడ్డి పై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇసుక తవ్వకాలు, బీచ్ శాండ్, బొగ్గు, గనుల్లో అక్రమాలు ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.