ఏపీసీసీ చీఫ్ షర్మిల అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా.. ఏపీసీసీ చీఫ్ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు.
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా.. ఏపీసీసీ చీఫ్ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిన్నటి నుంచి ఎక్కడిక్కడ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. అలాగే వైఎస్ షర్మిలను కూడా నిర్భందించారు. దీంతో నిన్న రాత్రి మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిద్రించిన ఆమె.. ఈ రోజు విజయవాడలోని సెక్రటేరియట్ కు బయలుదేరింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఉండవల్లి వద్ద ఏపీ పీసీసీ చీఫ్ అయిన వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి.. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది.