బర్రెలక్కకు ఏపీ నిరుద్యోగుల జేఏసీ మద్దతు

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ఒకప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Update: 2023-11-28 11:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ఒకప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ ఆడించిన బర్రెలక్క ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో సంచలనంగా మారింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. బర్రెలక్కకు విపరీతంగా మద్దతు లభిస్తోంది. ప్రాంతాలకు అతీతంగా ఆమెకు విపరీతమైన మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఏపీ నుంచి మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఆమెకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బర్రెలక్కకు వివిధ వర్గాల మద్దతు లభిస్తోంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఆమెకు మద్దతుగా ఇటీవల ప్రచారం నిర్వహించారు. తాజాగా, బర్రెలక్కకు ఏపీ నిరుద్యోగుల జేఏసీ కూడా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ప్రదర్శన చేపట్టింది. ఏపీ నిరుద్యోగ జేఏసీ సభ్యులు బర్రెలక్కకు మద్దతుగా నినాదాలు చేశారు. యువత మేలుకో... బర్రెలక్కను గెలిపించుకో అంటూ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈనెల 30న జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు తెలంగాణ ప్రజలు ఓటు వేసి అసెంబ్లీలో ప్రవేశించి నిరుద్యోగుల తరఫున గొంతుక వినిపించేందుకు వీలుగా ఆమెను గెలిపించాలని ఏపీ నిరుద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. 

Tags:    

Similar News