AP TET-2024 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. వారికి మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

ఎన్నికల ముందు ఏపీలో నిర్వహించిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల అయ్యాయి.

Update: 2024-06-25 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు ఏపీలో నిర్వహించిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల అయ్యాయి. ఈ మేరకు ఫలితాలను అధికారికంగా మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యప్తంగా టెట్ పరీక్షలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 2.67 లక్షల మంది టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. అందులో 2.35 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. డీఎస్సీలో టెట్ మార్కులను 20 శాతం వెయిటేజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఇటీవల బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి త్వరలో మరోసారి టెట్ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.


Similar News