AP Police: న్యూఇయర్‌ వేడుకలపై ఏపీ పోలీసుల ఆంక్షలు ఇవే..

ఆంధ్రప్రదేశ్(Andrapradesh) లో న్యూఇయర్‌ వేడుకలపై(New Year celebrations) పోలీసుల ఆంక్షలు(Police restrictions) విధించారు.

Update: 2024-12-29 11:00 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andrapradesh) లో న్యూఇయర్‌ వేడుకలపై(New Year celebrations) పోలీసుల ఆంక్షలు(Police restrictions) విధించారు. ఈ మేరకు సీపీ రాజశేఖర్ బాబు(CP Rajashekar  Babu) కొత్త సంవత్సరం వేళ పాటించాల్సిన నిబంధనలను ఓ ప్రకటనలో తెలియజేశారు. విజయవాడలో(Vijayawada) డిసెంబర్ 31న రాత్రి ఫ్లైఓవర్లు, పశ్చిమ బైపాస్‌పై ట్రాఫిక్‌ నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక బందర్‌, ఏలూరు, బీఆర్‌టీఎస్‌ రోడ్లపై ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇక బెంజ్‌ సర్కిల్‌, కనకదుర్గా ఫ్లైఓవర్‌లపై ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్, అసభ్య ప్రవర్తనలను అడ్డుకోవడానికి ప్రత్యేక బలగాలను నియమించినట్లు తెలియజేశారు. మధ్యం తాగి రోడ్ల మీదికి వస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. న్యూయర్ సందర్భంగా వేడుకలు జరుపుకోవాలనుకుంటున్న యువత నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ప్రజలు భద్రతా ప్రమాణాలు పాటించి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News