CM Chandrababu: దుర్గమ్మ సన్నిధిలో సీఎం చంద్రబాబు..
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకున్న సీఎంకు వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ ఎస్ నజీర్ (Governor Justice S Nazir)ను కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, ప్రజలను సీఎం కలవనున్నారు.