Breaking News: Nara Lokesh పాదయాత్రకు గ్రీన్‌సిగ్నల్

తెలుగుదేశం పార్టీకి పోలీస్ శాఖ తీపికబురు చెప్పింది. ఇప్పటివరకు నారా లోకేశ్ పాదయాత్రపై పోలీస్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది...

Update: 2023-01-23 09:49 GMT
  • నిబంధనలకు లోబడి పాదయాత్ర చేసుకోవాలని పోలీస్ శాఖ ఆదేశాలు
  • పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయోద్దని సూచన

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీకి పోలీస్ శాఖ తీపికబురు చెప్పింది. ఇప్పటివరకు నారా లోకేశ్ పాదయాత్రపై పోలీస్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అయితే లోకేశ్ పాదయాత్రకు అనుమతినిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలిచ్చింది. ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభం కానున్న నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్రకు అనమతినిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ వెల్లడించారు. నిబంధనలకు లోబడి పాదయాత్ర జరగాలని స్పష్టం చేశారు. పాదయాత్రలో ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.

కాగా నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఈనెల 12న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి, ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయితే ప్రభుత్వం నుంచి కానీ పోలీస్ శాఖ నుంచి కానీ ఎలాంటి అనుమతులు రాకపోవడంతో మరోసారి రిమైండ్ లెటర్ పంపించారు. దీనికి స్పందించిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి పలు అంశాలపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. అందుకు టీడీపీ అధిష్టానం వివరణ ఇచ్చింది. దీంతో పోలీస్ శాఖ అనుమతి మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి : ట్రెండింగ్‌లో #HBDYoungLeaderLokesh హ్యష్ టాగ్

Tags:    

Similar News