Simhachalam: సింహాచలం ఆలయంలో 945 కిలోల నెయ్యి సీజ్ చేసిన అధికారులు

తిరుమలలో లడ్డూ(Tirumala laddu) కల్తీ వివాదం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-22 00:02 GMT

దిశ, వెబ్‌డెస్క్:తిరుమలలో లడ్డూ(Tirumala laddu) కల్తీ వివాదం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల నెయ్యిని(Animal Fat) వినియోగించారని ఏపీ సీఎం(AP CM) చంద్రబాబు(Chandrababu)తో పాటు టీటీడీ ఈవో(TTD EO) శ్యామలరావు(Shyamala Rao) ప్రకటించారు.దీంతో ఆరోపణలు,ప్రత్యారోపణలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.కల్తీ నెయ్యికి గల కారణమైన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని,ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వివాదం కొనసాగుతున్న వేళ..ఏపీ(AP)లోని ప్రసిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాల‌లో ఒకటయిన విశాఖపట్నం(Vishakapatnam) జిల్లాలోని సింహాచలం అప్పన్నస్వామి ఆలయం(Simhachalam Appanna Swamy Temple)లో అధికారులు తనిఖీలు నిర్వహించి 945 కిలోల నెయ్యి(945 Kgs Ghee)ని సీజ్‌ చేశారు.ఏలూరు(Eluru) జిల్లా రైతు డెయిరీ(Farmer's Dairy) నుంచి ఈ నెయ్యి సరఫరా అయినట్లు అధికారులు వెల్లడించారు.నెయ్యి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించామని, అలాగే లడ్డూ ప్రసాదంలో వాడే ఇతర పదార్థాలను కూడా పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్టు అధికారులు చెప్పారు.భీమిలి ఎమ్మెల్యే(Bhimili MLA) గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలయంలో తనిఖీలు నిర్వహించి నెయ్యిని సీజ్ చేశామని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆహార భద్రత అధికారి(Food safety Officer) అప్పారావు(Apparao) తెలిపారు.

Tags:    

Similar News