AP News: ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం.. నిరాశతో వెనుదిరిగిన దొంగ

ఎస్‌బీఐ ఏటీఎం(SBI ATM)లో ఓ దొంగ(Thief) చోరికి యత్నించిన ఘటన తూర్పు గోదావరి జిల్లా(East Godavari District)లో చోటు చేసుకుంది.

Update: 2024-12-31 13:14 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎస్‌బీఐ ఏటీఎం(SBI ATM)లో ఓ దొంగ(Thief) చోరికి యత్నించిన ఘటన తూర్పు గోదావరి జిల్లా(East Godavari District)లో చోటు చేసుకుంది. ఘటన ప్రకారం గోపాలపురం(Gopalapuram)లో ఎస్‌బీఐ బ్యాంకు(SBI Bank)కు అనుసంధానం చేసి బ్యాంకు నిర్వహకులు ఓ ఏటీఎంను ఏర్పాటు చేశారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ దొంగ ఏటీఎంలో దూరాడు. ఏటీఎంలో డబ్బు చోరీ చేసేందుకు బండ రాయితో ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. రాయితో ఎన్నిసార్లు కొట్టినా ఏటీఎం మిషన్ బాక్స్ తెరుచుకోకపోవడంతో నిరశాతో వెనుదిరిగాడు. ఇవాళ ఉదయం డబ్బు తీసేందుకు కొందరు వ్యక్తులు ఏటీఎంకు వెళ్లగా.. ధ్వంసం అయ్యి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు అధికారుల చొరవతో ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృష్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News