Madhavi Latha: నన్ను చంపాలనుకుంటే చంపేయండి.. హీరోయిన్ భావోద్వేగం
ప్రముఖ సినీ నటి, బీజేపీ(BJP) నాయకురాలు మాధవీలత(Madhavi Latha)పై టీడీపీ(TDP) నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటి, బీజేపీ(BJP) నాయకురాలు మాధవీలత(Madhavi Latha)పై టీడీపీ(TDP) నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఒక ప్రాస్టిట్యూట్ అని.. తనను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. జేసీ వ్యాఖ్యలపై మాధవీలత స్పందించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ‘వయసైపోయిన పెద్ద మనిషి మాట్లాడిన భాషకు ధన్యవాదాలు. ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం. నన్ను చంపాలనుకుంటే వెంటనే చంపేయండి.
కానీ, మహిళల మాన, ప్రాణ సంరక్షణ విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గను. ఒంటరిగానైనా పోరాటం చేస్తాను. సినిమాల్లో ఉన్నవాళ్లంతా ప్రాస్టిట్యూట్లని ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన జిల్లాను నుంచి ఎవరూ ఇండస్ట్రీకి రావొద్దు’ అని మాధవీలత అన్నారు. అంతకుముందు జేసీ వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్(Minister Satya Kumar) సీరియస్ అయ్యారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు, అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదని మంత్రి మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డి వయసుకు తగినట్లుగా మాట్లాడాలని ఆగ్రహించారు. ఎక్కడో బస్సు కాలిస్తే బీజేపీకి ఏం సంబంధం అని ఫైర్ అయ్యారు.