AP News : సంక్రాంతికి 7200 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండగ(Sankranthi Festival) నేపథ్యంలో ప్రత్యేక బస్సులు(Special Buses) నడపాలని ఏపీ ప్రభుత్వం(AP Govt) నిర్ణయించింది.

Update: 2025-01-07 09:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండగ(Sankranthi Festival) నేపథ్యంలో ప్రత్యేక బస్సులు(Special Buses) నడపాలని ఏపీ ప్రభుత్వం(AP Govt) నిర్ణయించింది. పండుగకు ప్రయాణికులను సొంతూల్లకు చెరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) భారీగా ప్రత్యేక సర్వీసులను నడపనుంది. తెలంగాణతోపాటు ఇతర పొరుగు రాష్ట్రాలకె కాకుండా రాష్ట్రంలో మొత్తం 7200 బస్సులు నడపనున్నారు. రేపటి నుంచి ఈ నెల 13 వరకు 3900 బస్సులు అదనపు సర్వీసులను నడుపుతామని తెలిపింది. హైదరాబాద్(Hyderabad) నుంచి ఏపీలోని పలుచోట్లకు 2,153 స్పెషల్ బస్సులను, అలాగే బెంగుళూరు(Bengulur) నుంచి 375 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. కాగా ఈ ప్రత్యేక సర్వీసుల్లో అదనపు ఛార్జీలు విధించనున్నట్టు సంస్థ పేర్కొంది. సాధారణ సర్వీసుల్లో మాత్రం ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండబోవని వెల్లడించింది.  

Tags:    

Similar News