High Cout: తొందరపాటు చర్యలొద్దు..
వైసీపీ సోషల్ మీడియా నేత సజ్జల భార్గవ్ పై తొందర పాటు చర్యలొద్దని ఏపీ హైకోర్టు సూచించింది...
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) సోషల్ మీడియా నేత సజ్జల భార్గవ్(Sajjal Bhargav)పై తొందర పాటు చర్యలొద్దని ఏపీ హైకోర్టు(Ap High Court) సూచించింది. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై మహిళా నాయకురాలు, హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha)పై చేసిన అసభ్య పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు నమోదు అయ్యాయి.\
దీంతో సజ్జలను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ మేరకు సజ్జల భార్గవ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఇరువర్గాల విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి, పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సజ్జల అరెస్ట్‌పై తొందరపాటు చర్యలొద్దని ఆదేశించింది. గత విచారణలోనూ కోర్టు ఇవే ఆదేశాలను ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ ఆదేశాలను 8 వారాలు పొడిగిస్తున్నట్లు సూచించింది. భార్గవ్ పై ఫిర్యాదుదారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.