CPI: అదానీతో మోడీ, చంద్రబాబు, పవన్ కుమ్మక్కు.. సీపీఐ నేత హాట్ కామెంట్స్

మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదానీతో కుమ్మక్కు అయ్యారని సీపీఐ నేత బాబు రావు(CPI Leaders Babu Rao) ఆరోపించారు.

Update: 2025-01-08 08:51 GMT

దిశ, వెబ్ డెస్క్: మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదానీతో కుమ్మక్కు అయ్యారని సీపీఐ నేత బాబు రావు(CPI Leaders Babu Rao) ఆరోపించారు. ప్రధాని మోడీ ఏపీ పర్యటన(PM Modi AP Tour) నేపథ్యంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా బాబు రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలపై ఛార్జీల మోత ఉండబోదని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం(NDA Government) మోసం చేసిందని, గత ప్రభుత్వంలో బాదుడు అని చెప్పి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే బాదుడుని స్పీడ్ గా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలల కాలంలోనే 15,500 కోట్ల రూపాయలు సర్ధుబాటు చార్జీల పేరుతో భారం వేశారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మొత్తాన్ని మోడీ(PM Modi), చంద్రబాబు(CM Chandhrababu), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) కుమ్మక్కై అదానీ(Adani)కి కట్టబెడుతున్నారని, ఈ హక్కు వారికి ఎవరిచ్చారని పైర్ అయ్యారు. లక్షా 10 వేల కోట్ల రూపాయల సోలార్ విద్యుత్ భారం పేరుతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే.. ఈ ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తుందని ప్రశ్నించారు. గతంలో అవినీతి ఒప్పందం అని చెప్పి దీని మీద కేసు వేశారని, ఇప్పుడు అది నీతి ఒప్పందం అని చంద్రబాబు సర్టిఫికేట్ ఇస్తారా? లేక రద్దు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షా 10 వేల సోలార్ భారం ఒప్పందాన్ని రద్దు చేయకుంటే ప్రజలు ఊరుకోరని హెచ్చిరించారు. మోడీ, చంద్రబాబు, పవన్ అదానీతో కుమ్మక్కు అయితే.. తాము జనం తరుపున పోరాడుతున్నామని చెప్పారు. గతంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చిన టీడీపీ.. ఇప్పుడు అదానీ మేలు కోసం స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని విమర్శించారు. ఈ స్మార్ట్ మీటర్ల(Smart Meters) విధానాన్ని, సర్ధుబాటు చార్జీల విధానాన్ని తొలగించాలని, అదానీతో ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, అంతవరకు వామపక్షాల పోరాటం ఆగదని బాబురావు అన్నారు. 

Tags:    

Similar News