తొడగొడుతూ.. మీసం మెలేస్తూ.. చంద్రబాబుకు మంత్రి ధర్మాన సవాలు

శ్రీకాకులం జిల్లా కళింగపట్నంలో మంత్రి ధర్నాన ప్రసాదరావు పర్యటించారు.

Update: 2023-04-04 10:09 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకులం జిల్లా కళింగపట్నంలో మంత్రి ధర్నాన ప్రసాదరావు పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 3వ విడత కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మాజీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన తన స్టైల్ కు భిన్నంగా వ్యవహరించారు. మీసం మెలేసి తొడగొడుతూ ప్రసంగం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో నయా పైసా కూడా తీసుకోకుండా పథకాలు అమలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు తొడగొట్టి చెప్పగలరా అని ధర్మాన సవాలు విసిరారు. కాగా ఎప్పుడూ ఏమాత్రం ఎమోషనల్ కాకుండా బ్యాలెన్స్ గా మాట్లాడే ధర్మాన తాజా ప్రసంగంపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. 


Tags:    

Similar News