ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్గి రాజేసే కుట్ర.. MLA కౌశిక్ రెడ్డి పై ఏపీ నేత సీరియస్

కేసీఆర్ ప్రాంతీయ ఉన్మాద పైత్యాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పునికి పుచ్చుకొని మరో ఆంధ్రా - తెలంగాణ ఉన్మాద వివాదాలకు ఆజ్యం పోస్తున్నట్టు ఉందని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు.

Update: 2024-09-13 14:12 GMT

దిశ, రాజమహేంద్రవరం: కేసీఆర్ ప్రాంతీయ ఉన్మాద పైత్యాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పునికి పుచ్చుకొని మరో ఆంధ్రా - తెలంగాణ ఉన్మాద వివాదాలకు ఆజ్యం పోస్తున్నట్టు ఉందని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఒకటికి పది మార్లు నీవు ఆంధ్రోడివి ఇక్కడకు బతకటానికి వచ్చావనే పైత్యం మాటలతో ఇప్పటికే అన్యాయమై పోతున్న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్గి రాజేసే కుట్ర మానుకోవాలని, చేతనైతే అభివృద్ధి పైన దృష్టి సారించమని వ్యాఖ్యానించారు. ఇలాంటి చేతకాని మాటలతో హీరో అవ్వాలనుకుంటున్న కౌశిక్ రెడ్డి జీరో అవ్వక తప్పదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం వాడైనా మరో రాష్ట్రంలో బ్రతకడానికే వస్తారని, తెలంగాణ బిడ్డలు మరో రాష్ట్రంలో బ్రతకటం లేదా అని ప్రశ్నించారు. ఈ అఖండ భారతదేశం నాది అని బతికేవాడే నిజమైన భారతీయుడని అన్నారు.

ఇది నా దేశం అని మరచి కొవ్వేక్కిన మాటలు మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డికి తెలంగాణా బిడ్డలే బుద్ధి చెప్పి ఆంధ్ర, తెలంగాణా ఐక్యతకు కృషి చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని ఎదుర్కోవటం చేతకాక ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నట్టు కౌశిక్ రెడ్డి మాటలు కనపడుతున్నాయన్నారు. విభజన ఉద్యమం పేరుతో అరాచకాన్ని సృష్టించిన కేసీఆర్ పరిస్థితిని నేడు చూసి కూడా కౌశిక్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటం ఉన్మాద చర్య కాకుండా ఏమైతుందని, చేతనైతే అరెకపూడి గాంధీని ఎదుర్కొని హీరో అనిపించుకోవాలని అలా కాకుండా ప్రాంతీయ ఉన్మాదంతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని అర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ హెచ్చరించారు .


Similar News