ముద్రగడను కలిసిన జనసేన నేతలు.. పార్టీలోకి ఆహ్వానం..?

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఈ క్రమంలో జనసేన నేతలు కాపు నేత ముద్రగడ పద్మనాభం తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.

Update: 2024-01-11 04:19 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఈ క్రమంలో జనసేన నేతలు కాపు నేత ముద్రగడ పద్మనాభం తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ రోజు ముద్రగడను తాడేపల్లిగూడెం జనసేన ఇన్‌ఛార్జ్ బొలిశెళ్లి శ్రీనివాస్, కాపు జేసీసీ నేతలు కిర్లంపూడిలో ఆయనను కలిశారు. అలాగే మరికొద్ది రోజుల్లో జనసేన కీలక నేతలు ముద్రగడను కలవనున్నట్లు తెలుస్తుంది. అయితే కాపు జేఏసీ నేతగా పేరొందిన ఆయన గత కొద్ది రోజులు ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఉండటం లేదు. దీంతో జనసేన నేతలతో ఆయన భేటీ కావడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే ముద్రగడను జనసేన నేతలు తమ పార్టీలో చేరమని కోరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ముద్రగడ మాత్రం వారు తనతో మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు తెలిపారు.

Tags:    

Similar News