AP High Court: గజ్జల వెంకట‌లక్ష్మి పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా తన నియామకాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ గజ్జల వెంకట‌లక్ష్మి (Gajjala Venkata Lakshmi) ఏపీ హైకోర్టు (AP High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-10-03 09:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా తన నియామకాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ గజ్జల వెంకట‌లక్ష్మి (Gajjala Venkata Lakshmi) ఏపీ హైకోర్టు (AP High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ తన వాదనలు వినిపించారు. 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీ కాలం ఇంకా ఉన్నప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తన క్లయింట్‌ను పదవి నంచి తొలగించారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు గజ్జల వెంకటలక్ష్మి (Gajjala Venkata Lakshmi) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, సెప్టెంబర్ 23న వెంకటలక్ష్మిని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవి నుంచి తొలగిస్తూ.. కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె తన నియామకాన్ని రద్దు చేయడాన్ని సవాల చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.   


Similar News