ఆస్తుల విభజనపై Supreme Courtకు ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతూనే ఉంది..

Update: 2022-12-14 08:46 GMT

దిశ, వెబ్‌ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర విభజనతో ఆర్థికంగానూ, ఆస్తుల అంశంలోనూ తీవ్ర నష్టం జరిగిందని ఏపీ వాదిస్తోంది. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు పరిష్కరించాలని కోరుతూనే ఉంది. మరోసారి కూడా ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విభజన ఆస్తులను విభజించకపోవడం వల్ల తెలంగాణకు రూ.1.42 లక్షల కోట్ల విలువైన ఆస్తి చేకూరిందని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 91 శాతం ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంది.


Similar News