పోలవరంలో మరో డయా ఫ్రం వాల్.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

పోలవరంలో మరో డయా ఫ్రం వాల్ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది..

Update: 2024-07-25 13:23 GMT

దిశ, వెబ్ డెస్క్: పోలవరం త్వరగా పూర్తి చేసేందుకు సహకరిస్తామని లోక్ సభ వేదికగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. పోలవరం నిర్మాణ పనులపై ఇప్పటికే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ప్రాజెక్టు పనుల్లో  గత ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల, పోలవరం డయా ఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు పలుమార్లు చంద్రబాబు, టీడీపీ మంత్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత స్థితి, గతులపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చించారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం సాయం చేస్తామని ప్రకటించడంతో మరో డయా ఫ్రం వాల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.  పోలవరం పాత ఢయా ఫ్రం వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించే యోచనపై కేబినెట్ భేటీలో చంద్రబాబు చర్చించారు. ఇందుకు ఏపీ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ నెల 27న జరిగే నీతి అయోగ్ సమావేశంలో పోలవరం కొత్త డయా ఫ్రం వాల్‌పై చంద్రబాబు ప్రతిపాదనలు  అందజేయనున్నారు. 

Tags:    

Similar News