Breaking: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విధుల్లో చేరని అంగన్‌వాడీలను తొలగించాలని ఆదేశం

అంగన్‌వాడీల ఆందోళనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ...

Update: 2024-01-22 05:33 GMT

దిశ, వెబ్ డెస్క్: అంగన్‌వాడీల ఆందోళనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విధుల్లో చేరని అంగన్ వాడీలను తొలగించాలని ఆదేశించింది. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేశారు. అయినా అంగన్ వాడీలు వెనక్కి తగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని పట్టుబడ్డారు. అంతేకాదు ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. అయితే వీరి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించారు. సోమవారం తెల్లవారుజామున ధర్నా చౌక్ వద్దకు వెళ్లి అంగన్‌వాడీలను అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించారు.

కాగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలను ఇవాళ చలో విజయవాడ పిలుపునిచ్చన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడకు వెళ్లే అన్ని దారుల్లో ప్రటిష్ట నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ అంగన్‌వాడీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయింది. 

Tags:    

Similar News