రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు

రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను 48 గంటల్లోనే చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-05 12:38 GMT

దిశ, వెబ్ డెస్క్: రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను 48 గంటల్లోనే చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమం, పౌరసరఫరాలపై కలెక్టర్లతో చంద్రబాబు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ గత సర్కార్ విధానాలను పక్కన పెట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు అనుకూలంగా  పని చేయాలని, ఆ మేరకు కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.


సివిల్ సప్లైకు సంబంధించి 2014-19 అనుసరించిన విధానాన్నే ప్రస్తుతమూ అమలు చేయాలన్నారు. రేషన్ కార్డు‌దారులకు మిల్లెట్లు అందజేయాలని సూచించారు. చేనేతలకు ఆధునిక యంత్రాలు అందజేసి అండగా నిలవాలన్నారు. మద్యం షాపులను గౌడ కుటుంబాలకు రిజర్వ్ చేయాలని సూచించారు. కొన్ని కులాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాయని చెప్పారు. వారందరికి సామాజిక న్యాయం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

Tags:    

Similar News