APGESA: సార్ మా సంఘాన్ని ఆహ్వానించండి..
ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు తమ సంఘాన్ని ఆహ్వానించాలని .
దిశ, ఏపీ బ్యూరో: ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు తమ సంఘాన్ని ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ బృందం మంత్రి బొత్స సత్యనారాయణను కోరింది. గురువారం ఉద్యోగ సంఘ నేతలు బొత్స సత్యనారాయణ తో భేటీ అయ్యారు.. రాష్ట్రంలో ఉద్యోగ సమస్యలపై జరుగు చర్చలకు తమ సంఘాన్ని ఆహ్వానించాలని కోరారు.. రాష్ట్ర విడిపోయిన తర్వాత పూర్తిస్థాయిలో ఆఫీస్ సబార్డినేట్ నుండి ఆఫీసర్ వరకు సభ్యత్వం ఉన్న ఏకైక సంఘం తమ సంఘం అని పేర్కొన్నారు. గతంలో పిఆర్సి విషయంలో తమ సంఘం ఉద్యోగుల పక్షం నిలిచి మన్నలను పొందిందని గుర్తు చేశారు.