ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్.. ఏ పదవి అంటే..

తెలంగాణ నుంచి రిలీవై ఏపీకి వెళ్లిన ఐఏఎస్ ప్రశాంతికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆమెను అటవీ, పర్యావరణశాఖ అదనపు కార్యదర్శిగా నియమించింది.

Update: 2024-10-20 12:36 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ ప్రశాంతికి ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. ఏపీలో రిపోర్ట్ చేసిన నలుగురు ఐఏఎస్ అధికారుల్లో ఒకరైన ప్రశాంతిని అటవీ, పర్యావరణశాఖ అదనపు కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. 

కాగా ఏపీ, తెలంగాణలో పని చేస్తు్న్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లను వారి వారి కేడర్‌లో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఏపీ కేడర్ ఐఏఎస్‌లు అమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ప్రశాంతి, ఐపీఎస్‌లు అంజనీకుమార్, అభిలాష, అభిషేక్ మొహంతి పని చేస్తున్నారు. కేంద్రం ఆదేశాలతో వీరంతా ఏపీలో రిపోర్టు చేశారు. దీంతో వారికి ప్రభుత్వం పోస్టింగులు కల్పించింది. ఇందులో భాగంగా ఐఏఎస్ అధికారి ప్రశాంతి సైతం ఏపీలో రిపోర్టు చేయడంతో ఆమెకు సైతం పోస్టింగ్ కల్పించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 


Similar News