మెరైన్ ఫిషింగ్‌లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానం

దేశంలో మెరైన్ ఫిషింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నెం.1 స్థానంలో ఉందన్నారు ఏపీ మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.

Update: 2024-08-11 13:23 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో మెరైన్ ఫిషింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నెం.1 స్థానంలో ఉందన్నారు ఏపీ మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఆదివారం మచిలీపట్నంలో కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారుల బృందం పర్యటించింది.తీరప్రాంతాల్లో ఆక్వా, మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కేంద్ర బృందానికి మంత్రి రవీంద్ర వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీకి 972 కిమీల మేర సముద్ర తీరా ప్రాంతం ఉన్నప్పటికీ.. చేపల వేటలో కొత్త పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోలేక పోతున్నారని అన్నారు. ఆక్వా రంగ అభివృద్దికి మచిలీపట్నంలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర బృందాన్ని కోరామని తెలిపారు. చిన్న షిప్స్ కు తోడుగా, మదర్ షిప్స్ ఏర్పాటు చేసే అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని అన్నారు. సాగరమాల పేరుతో సముద్ర తీరానికి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి నితిన్ ఘడ్కరిని కోరతానని అన్నారు. అలాగే రేపల్లె-మచిలీపట్నంను కలిపే రైల్వే మార్గం ఏర్పాటు చేయమనీ రైల్వేశాఖ మంత్రిని కోరనున్నట్టు మంత్రి రవీంద్ర తెలిపారు. అలాగే సముద్ర తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీరప్రాంతంలో మడ అడవుల అభివృద్దికి అందరూ కృషి చేయాలని కోరారు.      


Similar News