పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. దీక్ష విరమించేంది అక్కడే...!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో విరమించనున్నారు...
దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీపై క్షమించమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ దీక్షను పవన్ కల్యాణ్ తిరుమలలో విరమించనున్నారు. ఈ మేరకు ఆయన అక్టోబర్ 1న తిరుపతి వెళ్లనున్నారు. అలిపిరి మెట్లమార్గంలో నడుచుకుంటూ తిరుమల కొండకు చేరుకుంటారు. అక్టోబర్ 2న ఉదయం శ్రీవారి దర్శించుకుంటారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభ(Varahi Sabha)ను నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంకటేశ్వరస్వామిని క్షమించమంటూ పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల దీక్ష ప్రస్తుతం కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శించిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కళ్యాణ్ విరమించనున్నారు.