సీఎం చంద్రబాబు హెచ్చరికలతో జారుకునే ప్రయత్నం.. చెక్ పెట్టిన సీఎస్
ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణకు సీఎస్ నీరబ్ కుమార్ షాక్ ఇచ్చారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది అధికారులు జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేరే చోటే ఉద్యోగాలు చూసుకుని తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు.
ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ తాజాగా అదేబాటలో నడిచారు. మూడు రోజుల క్రితం నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో జాయిన్ అయ్యారు. అటు రైల్వే ఉన్నతాధికారులు సైతం వెంటనే పోస్టింగ్ ఇచ్చారు. దీంతో మార్గం సుగుమం అయిందనకున్న సత్యనారాయణకు ఏపీ ప్రభుత్వ కార్యదర్శి నీరబ్ కుమార్ షాక్ ఇచ్చారు. ఈస్ట్రన్ రైల్వేలో సత్యనారాయణ జాయిన్ అవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీవింగ్ అర్డర్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆర్డర్‌ను సీఎస్ నిలిపివేశారు. సత్యనారాయణ గత ప్రభుత్వంలో వైసీపీ నేతలకు అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో సత్యనారాయణను రిలీవ్ కావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అటు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ ఈ నెల 18 వరకూ లీవ్‌లో ఉండటంతో సత్యనారాయణ ప్రయత్నాలకు సీఎస్ చెక్ పెట్టారు.
Read More: తప్పు చేస్తే TDP నేతలైనా సరే వదిలేదే లేదు.. హోం మినిస్టర్ అనిత వార్నింగ్