ఏపీ ఫైబర్ నెట్ కేసుపై విచారణ వాయిదా

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

Update: 2023-12-12 13:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఈ కేసులో తీర్పు ఇతర కేసులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 17కి వాయిదా వేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇటు చంద్రబాబు కానీ, అటువైపు ఏపీ ప్రభుత్వం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News