సంచలన సర్వే: వైసీపీ విజయదుందుభి, టీడీపీ గెలిచేస్థానాలేన్నంటే!
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌తోపాటు టీడీపీ, జనసేన,బీజేపీ పార్టీలు సైతం వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల అధినేతలు ప్రజల్లో తిరుగుతుండటంతో అప్పుడే ఎన్నికలను సీన్ తలపిస్తుంది. ఇదే సమయంలో గెలుపు ఓటములపై ఎవరికి వారే సర్వేలు చేయించుకుని మరీ టికెట్లు కేటాయిస్తున్నారు. మరోవైపు కొన్ని సంస్థలు సైతం సర్వేలు చేస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ ఏపీలో ఈటీజీ ఓపినీయన్ పోల్ సర్వే నిర్వహించింది. పార్లమెంట్ స్థానాలపై సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయి? అధికార వైసీపీకి ఎన్నిసీట్లు వస్తాయి? టీడీపీ ఎన్ని స్థానాల్లో గెలుపొందుతుంది? మరి బీజేపీ,జనసేన పరిస్థితి ఏంటనేదానిపై సర్వే చేపట్టింది. అయితే ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలో వెల్లడించింది.
వైసీపీ క్లీన్ స్వీప్
ఆంధ్రప్రదేశ్‌లో టైమ్స్ నౌ-ఈటీజీ ఒపీనియనో పోల్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందుతుందని వెల్లడించింది. ఏపీలో మెుత్తం 25 స్థానాలకు గానూ 25 స్థానాల్లోనూ గెలుపొందే అవకాశాలు లేకపోలేదని సర్వేలో తెలిపింది. అయితే తెలుగుదేశం పార్టీ కేవలం ఒక స్థానం కైవసం చేసుకుంటుంది అని తెలిపింది. అయితే జనసేన, టీడీపీ,బీజేపీ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపదని తెలిపింది. జనసేన ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.
వైసీపీకి పెరగనున్న ఓట్ల శాతం
టైమ్స్ నౌ-ఈటీజీ ఒపీనియన్ పోల్ ఈ ఏడాది జూన్ 15 నుంచి ఆగస్ట్ 12వ తేదీ మధ్య నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రజల అభిప్రాయాలను సేకరించినట్టు వెల్లడించింది. 2019లో వైసీపీ 49.8 శాతం ఓట్లతో 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. తాజా సర్వే ప్రకారం వైసీపీ ఓట్ల శాతం 1.5 శాతం పెరిగే అవకాశం ఉంది అని సర్వేలో స్పష్టం చేసింది. ఇక దేశవ్యాప్తంగా 543 ఎంపీ సీట్లలో వైసీపీకి 2.67శాతం ఓట్లు వస్తాయని స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయని వచ్చే ఎన్నికలను తీవ్ర ప్రభావం చూపిస్తాయని సర్వే తెలిపింది. ఇకపోతే ఎన్డీఏ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాబోతుందని తెలిపింది. ఎన్డీయే 42.60 శాతం ఓట్లతో అధికారంలోకి వస్తుందని తెలిపింది. నెహ్రూ తర్వాత వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన తొలి ప్రధానిగా నరేంద్ర మోడీయేనని తెలిపింది. బీజేపీ, ఇతర మిత్రపక్షాలు 326లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే తెలిపింది. ఇకపోతే ఇండియా కూటమి 160 నుంచి 190 సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది. అంతేకాదు ఎన్డీయే కూటమి గత ఎన్నికల ఫలితాల కంటే కొన్ని స్థానాలు కోల్పోతుందని తెలిపింది.