General Election 2024 : ఏపీ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్.. సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నగారా మోగింది. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నగారా మోగింది. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. దేశంలో ఈ సారి లోక్ సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనుండగా.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో మే 13న జరిగే నాలుగవ దశలో పోలింగ్ జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఏప్రిల్ 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
మే 13న పోలింగ్, జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌పై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైసీపీ చీఫ్, సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. 13 మే 2024న ఎన్నికలకు సిద్ధం అని ఏపీ ఎలక్షన్ డేట్‌ను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓట్ ఫర్ ఫ్యాన్, సిద్ధం అనే హ్యాష్ టాగ్‌లను జగన్ జత చేశారు. జగన్ ట్వీట్‌కు వైసీపీ నేతలు భారీగా రియాక్ట్ అవుతున్నారు. ఎన్నికల యుద్ధానికి మేం సిద్ధం బాస్ అని రీట్వీట్స్ చేస్తున్నారు.