AP EAPCET-2024: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్ (EAPCET) కీ విడుదల
ఆంధ్రప్రదేశ్ ‘అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్’ (EAPCET) ఎగ్జామ్ ప్రిలిమినరీ కీ గురువారం రాత్రి విడుదలైంది.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ‘అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్’ (EAPCET) ఎగ్జామ్ ప్రిలిమినరీ కీ గురువారం రాత్రి విడుదలైంది. ప్రైమరీ కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్, రెస్పాన్స్ షీట్లను కూడా ఆన్‌లైన్‌లో విడుదలన చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారికంగా వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థులకు తమ అభ్యంతరాలు ఉంటే మే 25న ఉదయం 10 గంటల లోపు తెలియజేయాలని సూచించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మే 16, 17 తేదీల్లో ఈఏపీసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష నిర్వహించగా.. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లకు కలిపి దాదాపు 3.61లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 18న ప్రారంభమైన ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నేటితో ముగిశాయి. కీ వివరాలను పరిశీలించేందుకు https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలని అధికారులు తెలిపారు.