PAWAN KALYAN: గొప్ప మనసు చాటుకున్న AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. గుండె జబ్బుతో బాధపడుతోన్న చిన్నారికి సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గం నిడమర్రు మండలం పెద్ద నిండ్రకొలను గ్రామానికి చెందిన బొంగా సురేష్, జోష్నా దంపతుల నెల బిడ్డకు గుండెకు రంధ్రం ఉండి అనారోగ్యానికి గురైంది. దీంతో వెంటనే ఆపరేషన్ చేయకుంటే బిడ్డకు ప్రాణాపాయం ఉందని వైద్యులు చెప్పడంతో.. ఆ తల్లిదండ్రులు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను ఆశ్రయించారు. ఈ ఆపరేషన్‌కు సుమారు 7 నుంచి 10 లక్షల రూపాయల ఖర్చు అవ్వగా, బొలిశెట్టి శ్రీనివాస్ మొత్తం తానే చూసుకొని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (సిమ్స్)లో బిడ్డకు చికిత్స అందించి, ప్రాణాలు కాపాడాడు.