RWS ల్యాబ్‌ ఉద్యోగులకు అండగా పవన్.. కీలక హామీ

ఏపీ డిప్యూటీ సీఎంపవన్ కళ్యాణ్‌నుగ్రామీణ నీటి సరఫరా విభాగం (RWS) కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు కలిశారు..

Update: 2024-10-06 10:20 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)ను ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (RWS)లో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ జీతాలు క్లీయర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు.

ఉద్యోగం ఇప్పించండి సార్...

ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ జి.సుజన కుమారి అనే దివ్యాంగురాలు పవన్‌కి విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా కమలాపురం ల్యాబ్‌లో పదేళ్లుగా హెల్పర్‌గా పని చేస్తున్నా తనను మూడు నెలల క్రితం విధులు నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువులను ఎత్తే పనులు చేయలేనని తెలిపారు. ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజన కుమారి వేడుకున్నారు. దీంతోఈ విషయమై అధికారులతో మాట్లాడతానని ఆమెకు పవన్ భరోసా ఇచ్చారు.


Similar News