అది పెద్ద క్రైమ్.. జోకర్ అవొద్దు: పవన్‌కు జాగ్రత్త చెప్పిన హర్షకుమార్

సనాతన ధర్మం అంటే ఏంటో పవన్ కల్యాణ్ చెప్పాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు...

Update: 2024-10-06 12:45 GMT

దిశ వెబ్ డెస్క్: సనాతన ధర్మం(Sanatana Dharma) అంటే ఏంటో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) చెప్పాలని మాజీ ఎంపీ హర్ష కుమార్(Former MP Harsha Kumar) డిమాండ్ చేశారు. ఇటీవల తిరుపతి(Tirupati)లో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సనాతన ధర్మం పేరు బాగుంది కాబట్టే పవన్ కల్యాణ్ ఊగిపోతూ, రెచ్చిపోతూ టీవీల్లో కనిపించారని హర్ష కుమార్ విమర్శించారు. హిందూ సనాతన ధర్మంలో వర్ణ, పంచమ వ్యవస్థలు ఉండాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని తమకు విశ్వహిందు పరిషత్ పండితులు నూరిపోశారా అని నిలదీశారు. భారత రాజ్యాంగాన్ని కాదని మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి సనాతన ధర్మం పేరు చెబుతున్నారా అని హర్ష కుమార్ ప్రశ్నించారు.

‘‘మనుధర్మ శాస్త్రా(India Constitution)న్ని హిందువులు(Hindus) ఆచరించరు. మీ సనాతర ధర్మం ఏంటో చెబితే దళితులకు క్లారిటీ ఉంటుంది. ఇప్పటికీ చాలా చోట్ల దళితులను గుడుల్లోకి రానివ్వరు. ఎక్కువగా కర్నూలు, కడప జిల్లాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ దళిత సర్పంచ్ గుడిలో పూజలు చేశారని ఫైన్ వేశారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం అంటూ మాట్లాడటంపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వాలి. గుడులలోకి హిందువులు రాకపోతే ఏం చర్యలు తీసుకుంటారో పవన్ చెప్పాలి. లేనిపక్షంలో సనాతన ధర్మం అంటున్న పవన్‌ను జోకర్(Joker) అని అనుకుంటారు. డిప్యూటీ సీఎంగా ఉండి మత ప్రచారకుడిలా వేషం వేసుకుని ప్రజలను రెచ్చగొట్టడం అది పెద్ద క్రైమ్. అటువంటి వాటిని పవన్ జాగ్రత్తగా సరిచేసుకోవాలి.’’ అని హర్ష కుమార్ కోరారు. 

Read More : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌ను కలిసిన స్టీల్‌ప్లాంట్‌ పోరాట కమిటీ నేతలు


Similar News