AP : జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యం.. సుప్రీం కోర్టు సీరియస్
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని కోరింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ వేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డిశ్చార్జ్ పిటిషన్‌ల వల్ల జాప్యం అవుతోందని కోర్టుకు సీబీఐ న్యాయవాది తెలిపారు. రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు, మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లు కలిపి విచారిస్తామని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.