అవినాశ్‌రెడ్డి తప్పుచేయలేదు.. అలా అనడం ఘోరం: సీఎం జగన్

వివేకా హత్య విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు....

Update: 2024-05-08 17:17 GMT
అవినాశ్‌రెడ్డి తప్పుచేయలేదు.. అలా అనడం ఘోరం:  సీఎం జగన్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానందారెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసని, అవినాశ్ రెడ్డి వివరణ కరెక్టేనని ఎవరికైనా అనిపిస్తుందని ఆయన తెలిపారు. ఓ టీవీ ఛానల్‌లో సీఎం జగన్ మాట్లాడుతూ తప్పు చేయని వ్యక్తిని తప్పు చేశారనడం దారుణమని మండిపడ్డారు. అవినాశ్ రెడ్డి తప్పు చేయలేదని చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. అవినాశ్ రెడ్డికి మద్దతు ఇవ్వాలన్నారు. చెల్లెళ్లకు న్యాయం చేయాలని మరొకరి అన్యాయం చేయలేమని, అది ధర్మం కాదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

వివేకా కేసును తప్పుదోవ పట్టిస్తూ సీబీఐ విచారణ కోరారని జగన్ చెప్పారు. కడప సెంట్రిక్‌గా వివేకా మర్డర్‌ను మార్చారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోకుండా ఉండాల్సిందన్నారు. వివేకా రెండో భార్యపై అవినాశ్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు లాజికల్‌గా సరేకదా అని సీఎం జగన్ అన్నారు. అవినాశ్ రెడ్డి ఎలాంటి వ్యక్తో జిల్లా ప్రజలకు బాగా తెలుసని, ఆయన వాదనలో న్యాయం ఉందనిపిస్తోందన్నారు. అవినాశ్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ జీవితం అంతా ఒక్కటేనని, దేవుడిపై నమ్మకం, ప్రజలపై విశ్వాసం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News