Ap Cm Jagan: ఆర్థిక శాఖ అధికారులతో భేటీ.. నిధుల సర్దుబాటుపై చర్చ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ...
దిశ వెబ్ డెస్క్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలకు ప్రతి నెలా అప్పులు చేయాల్సి పరిస్థితి నెలకొంది. అంతేకాదు జీతాలు సమయానికి కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిబోతోంది. దీంతో అర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఉద్యోగుల వేతనాల కోసం నిధుల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. రుణాల సేకరణకు ఉన్న అవకాశాలపైనా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నెల 21న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ట్యాబ్ కొనుగోలుకు నిధులు సమకూర్చడంపైనా సమావేశంలో అధికారులతో సీఎం జగన్ చర్చిస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధులు సర్దుబాటుపైనా జగన్ చర్చిస్తున్నారు.
Also Read....