Ap News: రజనీకాంత్‌కు సీఎం చంద్రబాబు విషెస్
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విషెస్ తెలిపారు...
దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth)కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) విషెస్ తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా రజనీకి సీఎం జన్మదిన శుభాకాంక్షలు(Happy Birthday) తెలిపారు. తన ప్రియమిత్రుడు, లెజెండరీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకున్నారు. సినిమాల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.