Tenth Exams: టెన్త్ పరీక్షలకు సర్వంసిద్ధం.. సీఎం చంద్రబాబు కీలక ట్వీట్

టెన్త్ పరీక్ష సీఎం చంద్రబాబు కీలక ట్వీట్

Update: 2025-03-16 14:32 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు (Tenth Class Exams) ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వంసిద్ధం చేశారు. మొత్తం 6.15 మంది విద్యార్థలు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 156 ఫ్లైయింగ్ స్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్ టీములు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ వరకు జరగనున్న ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.40 వరకూ జరగనున్నాయి. ఫిజికల్, బయలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11.30 వరకూ జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల(Studenst)కు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) విషెస్‌ చెప్పారు. పరీక్షలు రాస్తున్న యంగ్ ఫ్రెండ్స్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యా ప్రయాణంలో టెన్త్ పరీక్షలు కీలక మైలురాయి అని చెప్పారు. కష్టపడిన సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు పెట్టుకున్న నమ్మకమే విజయాన్ని అందిస్తోందన్నారు. కష్టపడి చదివి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేశారు. 

READ MORE ...

‘తల్లికి వందనం’ పై సీఎం కీలక ప్రకటన.. అకౌంట్‌లో డబ్బులు జమ అప్పుడే!

Full View

Tags:    

Similar News