ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్త పారిశ్రామికాభివృద్ధి పాలసీకి ఆమోదం

ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ కొనసాగుతుంది.

Update: 2024-10-16 07:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ కొనసాగుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, చెత్త పన్ను రద్దు, ఆలయాల పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ, దీపావళికి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం, నూతన పారిశ్రామిక విధానం, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ వంటి అంశాలను ఒక్కోక్కటిగా చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా ఇసుక, వరదలపై చర్చించిన అనంతరం రాష్ట్రంలో కొత్త పారిశ్రామికాభివృద్ధి పాలసీపై విచారణ జరిపిన అనంతరం ఏపీ కేబినెట్ పారిశ్రామికాభివృద్ధి పాలసీకి ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహించడమే కాకుండా యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కాగా సచివాలయంలో సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, అచ్చెన్నాయుడు ఇతర శాఖ మంత్రులు, వారితో పాటు ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు హర్యానా వెళ్లనున్నట్లు తెలుస్తుంది.


Similar News