AP: సార్వత్రిక ఎన్నికల వేళ అధికార వైసీపీకి బిగ్ షాక్.. ఆ ఇద్దరు అన్నదమ్ములు టీడీపీలోకి!
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు పార్టీలో ఉండి టికెట్ రాని అసంతృప్త నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇద్దరు నాయకులు అధికార వైసీపీని వీడి సైకిల్ ఎక్కేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఒంగోలు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన సోదరుడు శ్రీధర్ ఇప్పటికే వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సీఎం బస్సు యాత్రకు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన సోదరుడు శ్రీధర్ డుమ్మా కొట్టాడానికి కారణం అదేనని బయట జోరుగు చర్చ జరుగుతోంది.
మరో రెండు, మూడు రోజుల్లో వారు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఇటీవలే సీఎం జగన్ దర్శి ఎమ్మెల్యే టికెట్‌ను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇచ్చారు. కాగా, అంతకు ముందు నుంచే బూచేపల్లికి, ఎమ్మెల్యే మద్దిశెట్టికి మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. అంతే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టిని కాదని వైసీపీ అధిష్టానం బూచేపల్లికి అవకాశమిచ్చింది. దీంతో మద్దిశెట్టి బ్రదర్స్ వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.