ఏపీ పదో తరగతి ఫలితాలు.. 17 పాఠశాలలో అందరూ ఫెయిల్
సోమవారం ఉదయం ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ విడుదల చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: సోమవారం ఉదయం ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ విడుదల చేశారు. మొత్తం 6.18 లక్షల మంది విద్యార్థులకు గాను.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉంటే ఈ ఫలితాల్లో రాష్ట్రంలోని 2,803 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ కమిషనర్ సురేష్ వెళ్లడించగా.. వారి డేటా ప్రకారం.. 17 స్కూల్స్ లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని తెలిపారు. ఈ 17 స్కూళ్లలో 16 ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. ఒకే ఒక్క ప్రభుత్వ పాఠశాల ఉంది.
ఇదిలా ఉండగా పది ఫలితాల్లో ఎప్పటిలాగే అమ్మాయిలు పై చేయి సాధించారు. మొత్తం పరీక్ష రాసిన వారిలో 89.17 శాతం బాలికలు, 84.32 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. అలాగే సబ్జెక్టుల వారీగా చూసుకుంటే ఫస్ట్ లాంగ్వేజ్ లో 96.47శాతం, సెకండ్ లాంగ్వేజ్ లో 99.24శాతం, థర్డ్ లాంగ్వేజ్ లో 98.52శాతం, మ్యాథ్స్ లో 93.33 శాతం, జనరల్ సైన్స్ లో 91.29శాతం. సోషల్ స్టడీస్ లో 95.34 శాతం ఉత్తీర్ణత నమోదయిందని అధికారులు వెల్లడించారు.