ఆ రెండు స్థానాల్లో ఎక్కడైనా ఓకే.. మాజీ మంత్రి గుమ్మనూరు
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చేరికల హడావిడి జోరుగా కొనసాగుతోంది
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చేరికల హడావిడి జోరుగా కొనసాగుతోంది. అధికార వైసీపీపై తీవ్ర వ్యతిరేఖతతో ఉన్న నేతలతో పాటు కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష టీడీపీలోకి వరుస చేరికలు జరుగుతున్నాయి. ఇటీవలే వైసీపీ విడుదల చేసిన ఇన్ చార్జీల జాబితాలో సీటు దక్కక అసంతృప్తితో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. ఇవ్వాళ ఆయన అనుచర వర్గంతో పాటు ఆలూరుకు చెందిన వైసీపీ ముఖ్య నేతలందరినీ టీడీపీలో చేర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో వారికి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన గుమ్మనూరు జయరాం వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. నేను ఎక్కడ పోటీ చేసిన ఓడించాలని వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, ఏం చేస్తారో చేసుకోండని, నేను పోటీ చేసి, గెలిచేది ఖాయమని తేల్చి చెప్పారు. అలాగే ఆలూరు నియోజకవర్గ నాయకులు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారని, చంద్రబాబు కోసం పని చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే తాను గుంతకల్లు, ఆలూరులో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు అధినేతకు చెప్పానని, కానీ ఆయన ఎక్కడ పోటీ చేయమన్న సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే గుమ్మనూరు జయరాంను టీడీపీలో చేర్చుకోవడం ఇష్టం లేదని గుంతకల్లు టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గుంతకల్లు టీడీపీ నేతలకు వ్యతిరేఖంగా ఇంతకాలం వైసీపీలో ఉన్న నేతలందరూ పసుపు కండువా కప్పుకోవడంపై అసంతృప్తితో ఉన్న పార్టీ నేతలెలా స్పందిస్తారో చూడాలి.
Read More..
ఏపీలో చీప్ పాలిట్రిక్స్.. కండోమ్ లతో మొదలై గిఫ్ట్ బాక్సుల వరకు