శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతి మీదుగా మరో వందే భారత్ ట్రైన్.. ఛార్జీల వివరాలు ఇవే..
ఆదివారం దేశవ్యాప్తంగా తొమ్మిది వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా తొమ్మిది వందే భారత్ రైళ్లను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైళ్లు రెండు ఉన్నాయి. కాచిగూడ-యశ్వంత్‌పూర్, విజయవాడ-చెన్నై మధ్య వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టారు. కాచిగూడ-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ బుధవారం మినహా ఆరు రోజుల పాటు సర్వీసులు అందించనుంది. మెయింటనెన్స్ పనుల కోసం బుధవారం నిలిపివేయనున్నారు.
ఇక విజయవాడ-చెన్నై(20677) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా మిగతా రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇది ఉదయం 5.30 గంటలకు చెన్నై నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఇక మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.
తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఈ ట్రైన్ ఉపయోగపడనుంది. రేణిగుంటలో దిగి అక్కడ నుంచి బస్సులో సలువుగా తిరుమలకు చేరుకోవచ్చు. కేవలం 6 గంటల 40 నిమిషాల్లోనే ఈ ట్రైన్ విజయవాడ నుంచి చెన్నై వెళుతుంది. ఈ రైల్లో ఛార్జీల విషయానికొస్తే.. విజయవాడ నుంచి రేణిగుంటకు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.2110 ఉండగా.. చైర్ క్లాస్ టికెట్ ధర రూ.1175గా ఉంది.