తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం
తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు ఆదివారం రాత్రి ఆనంద నిలయం వరకూ మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లాడు. శ్రీవారి గర్భగుడిని బయటి నుంచి సెల్ ఫోన్
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు ఆదివారం రాత్రి ఆనంద నిలయం వరకూ మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లాడు. శ్రీవారి గర్భగుడిని బయటి నుంచి సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించాడు. విమాన వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుతున్న దృశ్యాలను సైతం చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది. వీడియో వైరల్‌గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ భక్తుడు సెల్ ఫోన్ తో గర్భగుడి వరకు వెళుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలోకి ఇతరత్రా లగేజీని కూడా అనుమతించరని అలాంటిది సెల్‌ఫోన్ తీసుకెళ్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తుంది. సదరు భక్తుడిని గుర్తించే ప్రయత్నం చేస్తుంది.