Key Decision: ఏపీలో కొత్తగా ఆరు మండలాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది..

Update: 2023-03-01 13:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు జిల్లాల్లోని జిల్లా కేంద్రం ఉన్న మండలాలను రెండేసి మండలాలుగా విడదీస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలును అర్బన్, రూరల్ మండలాలుగా విభజిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అలాగే మచిలీపట్నం మండలాన్ని మచిలీపట్నం సౌత్, నార్త్ మండలాలుగా విడదీస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లోని అభ్యంతరాలను, సలహాలు, సూచనలను 30 రోజుల్లోగా స్థానిక జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags:    

Similar News